Christian Telugu songs lyrics, Christian songs lyrics in Telugu

Christian Telugu songs lyrics here you can find some devotion songs in Telugu Christian songs lyrics.
Christian Telugu songs lyrics

Christian Telugu songs lyrics

Andaala taara
పల్లవి:    అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలో
ఆది దేవుని జూడ - అశింపమనసు – పయనమైతిమి                             .. అందాల తార..

1.        విశ్వాసయాత్ర - దూరమెంతైన - విందుగా దోచెను
వింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమున
విశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్   .. అందాల తార..

2.        యెరూషలేము - రాజనగరిలో - ఏసును వెదకుచు
ఎరిగిన దారి - తొలగిన వేల - ఎదలో క్రంగితి
ఏసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు      .. అందాల తార..

3.        ప్రభుజన్మస్ధలము - పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ - జీవితమెంత - పావనమాయెను
ప్రభుపాదపూజ - దీవెనకాగా - ప్రసరించె పుణ్యము
బ్రతుకె మందిరమాయె - అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన            .. అందాల తార..

Aparadhini yessaya

పల్లవి:    అపరాధిని యేసయ్య - క్రపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ క్రపలో - నపరాధములను క్షమించు ..అపరాధిని..

1.        సిలువకు నినునే గొట్టితీ - తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా ..అపరాధిని..

2.        ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితి వయ్యో       ..అపరాధిని..

3.        ముళ్ళతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి
నావల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ             ..అపరాధిని..

4.        దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావినిడితి
ద్రోహుండనై జేసితినీ - దేహంబు గాయంబులను      ..అపరాధిని..

5.        ఘోరంబుగా దూరితిని - నేరంబులను జేసితిని
క్క్రూరుండనై గొట్టితిని - ఘోరంపి పాపిని దేవా          ..అపరాధిని..

Aadedhan paasedhan

పల్లవి:    ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో యేసుని సన్నిధిలో

స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో

ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో

ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో

స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో

ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో

1.        నను దర్శించి నూతన జీవం యిచ్చిన సన్నిధిలో

నను బలపరచి ఆదరించిన యేసుని సన్నిధిలో                             (2X)

ఆడెదన్, పాడెదన్ దేవుని సన్నిధిలో

స్తుతించెదన్ స్తుతించెదన్ ఆరధించెదన్ ఆరధించెదన్ దేవుని సన్నిధిలో

ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో

స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో

ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో

2.        పరిశుద్దాత్మజ్వాల రగిలించి నన్ను మండించిన సన్నిధిలో

పరిశుద్దాత్మలో నను అభిషేకించిన యేసుని సన్నిధిలో                     (2X)

ఆడెదన్, పాడెదన్ దేవుని సన్నిధిలో

స్తుతించెదన్ స్తుతించెదన్ ఆరధించెదన్ ఆరధించెదన్ దేవుని సన్నిధిలో

ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో యేసుని సన్నిధిలో

స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో

ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో

ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో

స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో

ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో

Athyunnatha simhaasanupai


పల్లవి:    అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన దేవా

అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతుము నిన్నే

ఆహాహా ... హల్లేలూయ  (4X)

ఆహాహా ... హల్లేలూయ  (3X)  ...ఆమెన్

1.        ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం

బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం

ఆహాహా

2.        కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం

నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణకర్తా స్తోత్రం

ఆహాహా

3.        ఆమేన్ అనువాడా స్తోత్రం - ఆల్ఫా ఒమేగా స్తోత్రం

అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా - అత్యున్నతుడా స్తోత్రం

ఆహాహా

4.        మ్రుత్యుంజయుడా స్తోత్రం - మహా ఘనుడా స్తోత్రం

మమ్మును కొనిపోవా త్వరలో రానున్న - మేఘవాహనుడా స్తోత్రం

ఆహాహా

Anni naamula kanna

పల్లవి:     అన్ని నామముల కన్న పై నామము _ యేసుని  నామము

ఎన్ని తరములకైన ఘనపరచ దగినది _ క్రీస్తేసు నామము

యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం  లయము

హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్                     (2X)

1.            పాపముల నుండి విడిపించును _ యేసుని  నామము

నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును _ క్రీస్తేసు నామము

యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం  లయము

హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్                     (2X)

2.         సాతాను పై అధికార మిచ్చును _ శక్తి గల  యేసు నామము

శత్రు సమూహము పై జయమునిచ్చును _ జయశీలుడైన యేసు నామము

యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం  లయము

హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్                     (2X)

3.         స్తుతి ఘన మహిమలు చెల్లించుచు _ క్రొత్త కీర్తన పాడెధము

జయ ధ్వజమును పైకెత్తి కేకలతో _ స్తోత్ర గానము చేయుదము

యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం  లయము

హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్                     (2X)

అన్ని నామముల కన్న పై నామము _ యేసుని  నామము

ఎన్ని తరములకైన ఘనపరచ దగినది _ క్రీస్తేసు నామము

యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం  లయము

హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్                     (2X)


Aaradhinchadenu

పల్లవి:   ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య  - ఆత్మతో సత్యముతో                   (2X)

ఆనందగానముతో -  ఆర్భటనాదముతో                               (2X)

ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య -  ఆత్మతో సత్యముతో                    (2X)

1.       నీ జీవవాక్యము నాలో -   జీవము కలిగించే                                             (2X)

జీవిత  కాలమంత,  నా యేసయ్య  -  నిన్నే కొలిచెదను                            (2X)

ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య  -  ఆత్మతో సత్యముతో   (2X)

2.       చింతలెన్ని కలిగినను -  నిందలన్ని నన్ను చుట్టినా                                 (2X)

సంతోషముగ నేను,   నా యేసయ్య -  నిన్నే వెంబడింతును                    (2X)

ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య  -  ఆత్మతో సత్యముతో                   (2X)

ఆనందగానముతో -  ఆర్భటనాదముతో                                                    (2X)

ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య  - ఆత్మతో సత్యముతో                   (2X)

Aalayamlo praveshinchandi

పల్లవి:    ఆలయంలో ప్రవేశించండి అందరూ
స్వాగతం సుస్వాగతం యేసునామంలో
మీ బ్రతుకులో పాపమా కలతలా
మీ హృదయంలో బాధలా కన్నీరా
మీ కన్నీరంతా తిడిచి వేయు రాజు యేసు కోసం

1.        దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై
వెదకే వారికంతా కనబడు దీపము
యేసురాజు మాటలే వినుట ధన్యము
వినుట వలన విశ్వాసం అధికమధికము
ఆత్మలో దాహము తీరెను రారండి
ఆనందమనందం హల్లెలూయా                                ..ఆలయంలో..

2.        ప్రభు యేసు మాటలే పెదవిలోమాటలై
జీవ వృక్షంబుగా ఫలియించాలని
పెదవితో పలికెదం మంచి మాటలే
హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై
నింపెదం నిండెదం కోరేదం పొందెదం
ఆనదంమానదం హల్లెలూయా                                 ..ఆలయంలో..

Aashcharyamana prema

పల్లవి:    ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ

మరణము కంటె బలమైన ప్రేమది - నన్ను జయించె నీ ప్రేమ

1.        పరమును వీడిన ప్రేమ - ధరలో పాపిని వెదకిన ప్రేమ

నన్ను కరుణించి, ఆదరించి, సేదదీర్చి, నిత్య జీవమిచ్చె             

…ఆశ్చర్యమైన ప్రేమ…

2.        పావన యేసుని ప్రేమ - సిలువలో పాపిని మోసిన ప్రేమ

నాకై మరణించి, జీవమిచ్చి, జయమిచ్చి, తన మహిమ నిచ్చే      

…ఆశ్చర్యమైన ప్రేమ…

3.        శ్రమలు సహించిన ప్రేమ - నాకై శాపము నోర్చిన ప్రేమ

విడనాడని, ప్రేమది, ఎన్నడు, యెడబాయదు                      

…ఆశ్చర్యమైన ప్రేమ…

4.        నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని జూపిన ప్రేమ

నాకై పరుగెత్తి, కౌగలించి, ముద్దాడి, కన్నీటిని తుడిచే               

…ఆశ్చర్యమైన ప్రేమ…

Aaha mahanandamane

పల్లవి:    ఆహా మహానందమే - ఇహ పరంబులన్

మహావతారుండౌ  - మా యేసు జన్మ దినం - హల్లేలూయ                .. ఆహా ..

1.        కన్యక గర్భమందు పుట్టగా - ధన్యుడవంచు దూతలందరు                   (2X)

మాన్యులౌ  పేద గొల్లలెందరో - అన్యులౌ  తూర్పు జ్ఞానులెందురో           (2X)  

నిన్నారాధించిరి - హల్లేలూయ                                                 .. ఆహా ..

2.        యెహోవా తనయా - యేసు ప్రభూ,  సహాయుడా - మా స్నేహితుడా     (2X)

ఈహా పరంబుల ఓ ఇమ్మనుయేల్ - మహానందముతో నిన్నారాధింతుము(2X)

నిన్నారాధింతుము - హల్లేలూయ                                             .. ఆహా ..

3.        సర్వేశ్వరున్ రెండవ రాకడన్ - స్వర్గంబు నుండి వచ్చు వేళలో              (2X)

సర్వామికా సంఘంబు భక్తితో - సంధించి నిన్ స్తోత్రిం చు వేళలో             (2X)

నిన్నారాధింతుము - హల్లేలూయ                               

Edhi kothaku samayam

పల్లవి:    ఇది కోతకు సమయం = పనివారి తరుణం ప్రార్ధన చేయుదమా

పైరును చూచెదమా = పంటను కోయుదమా

1.        కోతెంతో విస్తారమాయెనే కోసెడి పనివారు కొదువాయెనే

ప్రభుయేసు నిధులన్ని నిలువాయెనే                      ..ఇది కోతకు..

2.        సంఘమా మౌనము దాల్చకుమా కోసెడి పనిలోన పాల్గొందుమా
యజమాని నిధులన్ని మీకేగదా                              ..ఇది కోతకు..

3.        శ్రమలేని ఫలితంబు మీకీయగా కోసెడి పనిలోన పాల్గొందుమా
జీవార్ధ ఫలములను భుజియింతమా                       ..ఇది కోతకు..


Udhaya kaanthi rekhalo

పల్లవి:     ఉదయ కాంతి రేఖలో - బెత్లెహేము పురమున 

అవతరించెను బాల యేసు - పాపాలు మోయు గొర్రె పిల్ల

పాపాలు మోయు గొర్రె పిల్ల 

1.        పరమ పుత్రుని మోహన రూపుగని - తల్లి మరియ మురిసే 

బాల యేసుని మహిమ రూపు  ఈ జగానికి వెలుగై 

గొల్లలు జ్ఞానులు పరిశుద్దులు - ప్రస్తుతించిరి బాల యేసుని    .. ఉదయ..

2.        ఆకాశ తారల మెరుపు కాంతిలో - ప్రక్రుతి రాగాల స్వరాలతో 

హల్లెలూయ యని పాడుచు - దూత గణము స్తుతించిరి

జగ మొక ఊయలగా చేసి - దూతలు పాడిరి జోల పాట       .. ఉదయ.

Unnatha maina prema(Dm)

పల్లవి:    ఉన్నతమైన ప్రేమ - అత్యున్నతమైన ప్రేమ

శాశ్వతమైన ప్రేమ - పరిపూర్ణమైన ప్రేమ

యేసుని ప్రేమా - ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా

1.        నింగి నుండి నేలకు దిగివచ్చిన ప్రేమా

నేల నుండి నన్ను లేవనెత్తిన ప్రేమ                          (2X)

మంటి నుండి మహిమకు నను మార్చిన ప్రేమ              (2X)

ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా                     

… ఉన్నతమైన ప్రేమ …

2.        నీదు ప్రేమ నాకు జీవం - నా సమస్తమును

నీవు పొందిన శ్రమలన్నియును నాదుడెందములో           (2X)

నీవు కార్చిన రక్తమే నా -  ముక్తి మార్గమై                   (2X)

ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా                     

… ఉన్నతమైన ప్రేమ …

Latest hit songs lyrics in telugu and english:

Krishnaveni song - orey bujjiga, Rahul sipligunj

Raletti song lyrics - World famous lover, Vijay D

Hey choosa - Bheeshma, Nithiin

Vasthunna vachesthunna - V, Nani

Emo emo song - sid sriram, raahu

Ee maya premito - orey bujjiga, sid sriram

Dhak dhak dhak - Bheeshma, Nithiin

Ay pilla - love story, Naga chainthnya

Maguva maguva - Vakeel saab, Pawan kalyan(pspk)

Samajavaragamana - Ala vaikuntapurramlo, Allu arjun

Ramuloo ramulaa - Ala vaikuntapurramlo, Allu arjun

Butta bomma - Ala vaikuntapurramlo

He's so cute - Sarileru nikevvaru, Mahesh Babu

Neeli neeli aakasam - 30 rojullo preminchadam ela

Nee kannu neeli samudram - Uppena

Oo baava - pratiroju pandage, Sai tej


Post a Comment

0 Comments